Sahithi Infra Case: నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు.. ఈడీ కస్టడీకి సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ

రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారం పేరుతో వినియోగదారులకు కుచ్చుటోపీ పెట్టిన సాహితీ ఇన్‌ఫ్రా (Sahithi Infra) మేనేజింగ్ డైరెక్టర్ బి.లక్ష్మీనారాయణను (Lakshmi Narayana) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు (Nampally Court) అంగీకరించింది.

Update: 2024-10-07 13:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారం పేరుతో వినియోగదారులకు కుచ్చుటోపీ పెట్టిన సాహితీ ఇన్‌ఫ్రా (Sahithi Infra) మేనేజింగ్ డైరెక్టర్ బి.లక్ష్మీనారాయణను (Lakshmi Narayana) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు (Nampally Court) అంగీకరించింది. ఈ మేరకు ఆయనకు ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నెల 14 నుంచి 18 వరకు ఈడీ కార్యాలయం (ED Office)లోనే విచారణ కొనసాగనుంది. కాగా, సెప్టెంబర్ 30 సాహితీ ఇన్‌ఫ్రా (Sahithi Infra) మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను (MD Lakshmi Narayana)ను అరెస్ట్ చేశారు. అనంతరం విచారణలో భాగంగా ఈడీ అధికారులు నిందితుడిని 10 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలంటూ పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు అందుకు అంగీకరించింది.

కాగా.. ఫ్రీలాంచ్ పేరుతో వినియోగదారుల నంచి సాహితీ ఇన్‌ఫ్రా (Sahithi Infra) భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 9 ప్రాజెక్టుల పేరుతో లక్ష్మీనారాయణ సుమారు 700 మంది నుంచి రూ.360 కోట్ల వసూలు చేసినట్లుగా ఈడీ ఆరోపించింది. అందులో సాహితీ సితార పేరుతో రూ.135 కోట్లు, సిస్టాఅడోబ్‌ పేరుతో రూ.79 కోట్లు, సాహితీ గ్రీన్‌ పేరుతో రూ.40 కోట్లు, సాహితీ మెహతో పేరుతో రూ.44 కోట్లు, ఆనంద ఫర్చూన్‌ పేరుతో రూ.45 కోట్లు, సాహితీ కృతి పేరుతో రూ.16 కోట్లు, సాహితీ సుదిక్ష పేరుతో రూ.22 కోట్లు, రూబికాన్ సాహితీ పేరుతో రూ.7 కోట్లు, సాహితీ స్వాద్‌ పేరుతో రూ.65 కోట్లు వసూలు చేసి లక్ష్మీనారాయణ తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఈ కేసులో సాహితీ ఇన్‌ఫ్రాకు సంస్థకు చెందిన రూ.161 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. 


Similar News