ప్రయాణికులకు ఆర్టీసీ మరో గుడ్ న్యూస్
ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు వినూత్న ఆఫర్లు తీసుకు వస్తోంది. ఈ క్రమంలో తొలిసారిగా జనరల్ రూట్ బస్ పాస్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు వినూత్న ఆఫర్లు తీసుకు వస్తోంది. ఈ క్రమంలో తొలిసారిగా జనరల్ రూట్ బస్ పాస్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తున్న ఆర్టీసీ.. సిటీలో తక్కువ దూరంతో ప్రయాణించే వారి కోసం తొలిసారిగా రూట్ పాస్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. సిటీలో 8 కిలోమీటర్ల పరిధిలో తిరిగే ప్రయాణికుల ఈ రూట్ పాస్ ను మే 27 నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఈ రూట్ పాస్ ధరలను సంస్థ ప్రకటించింది. నెల రోజులకు గాను సిటి ఆర్డినరీ బస్ పాస్ లకు రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1000 నిర్ణయించింది. ఐటీ కార్డు కోసం రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.