దగ్గర్లోనే మీ బండారం బయటపడే రోజులు.. సర్కార్‌పై RSP సీరియస్

రాష్ట్ర ప్రభుత్వం- టీఎస్ పీఎస్సీ బోర్డు కుమ్మకయ్యాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

Update: 2023-05-26 14:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం- టీఎస్ పీఎస్సీ బోర్డు కుమ్మకయ్యాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ కేసులో ఓ వైపు అరెస్టులు జరుగుతుంటే మరోవైపు సిగ్గులేకుండా ప్రభుత్వం-టీఎస్ పీఎస్సీలు కుమ్మక్కై అదే కమిషన్‌తో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ బండారం బయటపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది.

దీంతో ఈ కేసులో నిందితుల సఖ్య 43కు చేరగా అరెస్ట్ అయిన వారి సంఖ్య 42కు చేరింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బోర్డుకు సంబంధించిన ఉద్యోగులే కీలక నిందితులుగా ఉన్న నేపథ్యంలో పాత బోర్డు సభ్యులతోనే వాయిదా పడిన పరీక్షలు జరపాలనే నిర్ణయంపై నిరుద్యోగులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మళ్లీ పాత టీఎస్ పీఎస్సీ బోర్డుతోనే పరీక్షలు నిర్వహించడం అంటే దొంగల చేతికే తాళాలు ఇచ్చినట్లేనని, అదే బోర్డు, అదే లీకులు, అవే కంప్యూటర్లు.. మారిందల్లా పరీక్ష తేదీలు మాత్రమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News