ఈడీ విచారణకు గైర్హాజరుపై Rohit Reddy క్లారిటీ

ఈడీ విచారణకు గైర్హాజరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

Update: 2022-12-27 07:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోల కేసులో ఈడీ దర్యాప్తుకు గైర్హాజరు కావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టులో తాను రిట్ పిటిషన్ దాఖలు చేశానని, కోర్టులో పిటిషన్ ఉన్నందున తాను ఈడీ విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు. తాను హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ బుధవారం విచారణకు రానున్నందున ఈడీ విచారణకు వెళ్లాలా? వద్దా అనేది తన న్యాయవాదులతో చర్చిస్తానన్నారు. తదుపరి విచారణకు హాజరు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తన న్యాయవాదులు ఎలా చెప్తే అలా చేస్తానన్న రోహిత్ రెడ్డి.. ఈడీ విచారణకు నేరుగా హాజరు కావాలన్నా హాజరు అవుతానన్నారు. ఈ కేసులో ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదని, అలాంటప్పుడు ఈడీ ఎలా ఇన్ వాల్వ్ అయిందనేది అర్థం కావడం లేదన్నారు. తనపై బీజేపీ కుట్ర చేస్తోందని కుట్రలో భాగంగానే నందకుమార్ ను ఈడీ విచారిస్తోందని ఆరోపించారు. కాగా కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. మరో వైపు మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ రంగంలోకి దిగడంతో కేసు దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసులో అసలు మనీ లాండరింగే జరగలేదని రోహిత్ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్‌గా అయింది..

Also Read...

Telangana ప్రభుత్వ పనితీరు అద్భుతం: పంజాబ్ స్పీకర్ 

Tags:    

Similar News