RGV: అల్లు అర్జున్, రేవంత్‌రెడ్డి అరెస్ట్‌లో కామన్ పాయింట్ అదే.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను (Allu Arjun) అరెస్ట్ (arrest) చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు, బన్ని అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పించారు
దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను (Allu Arjun) అరెస్ట్ (arrest) చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు, బన్ని అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ అరెస్టుపై రాంగోపాల్ వర్మ (Ramgopal Verma) తనదైన స్టైల్లో ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రేవంత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి అరెస్ట్‌లో కామన్ పాయింట్ ఏంటని ఆయన నెటిజన్లు (Netizens) ప్రశ్నించారు. అందుకు కొనసాగింపుగా ఆర్జీవీ, వాళ్లిద్దరూ తమ బెడ్ రూమ్‌లో (Bedroom) ఉన్నప్పుడే అరెస్టు అయ్యారంటూ సెటైర్లు వేశారు. అసలే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని ఓ వైపు మెగా కుటుంబం, మరోవైపు బన్ని ఫ్యాన్స్ బాధలో ఉన్న తరుణంలో ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ (viral) అవుతోంది.