విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రివైజ్డ్ దోస్త్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఉన్నత విద్యామండలి

డిగ్రీలో అడ్మిషన్లను నిర్వహించే దోస్త్ కౌన్సెలింగ్ గ‌డువును అధికారులు పొడిగించారు.

Update: 2024-06-12 16:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీలో అడ్మిషన్లను నిర్వహించే దోస్త్ కౌన్సెలింగ్ గ‌డువును అధికారులు పొడిగించారు. ఈ మేరకు బుధవారం గతంలో వెల్లడించిన తేదీలను రివైజ్ చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఫేజ్ 1 ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బుధవారం నాటికి కంప్లీట్ చేయాల్సి ఉండగా ఆ తేదీలను ఈనెల 15 వరకు పొడిగిస్తూ అవకాశం కల్పించారు. అలాగే ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 13తో ముగియాల్సి ఉండగా 15 వరకు పెంచారు. అలాగే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 14న ఉండగా 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.


Similar News