అగ్నిమాపక శాఖ డైరెక్టర్ సమీక్షా సమావేశం

అగ్నిమాపక శాఖ అధికారులు సమర్ధవంతంగా పని చేసేందుకు, శాఖను మెరుగు పరచడంపై డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ వై నాగిరెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించారు.

Update: 2024-08-05 16:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : అగ్నిమాపక శాఖ అధికారులు సమర్ధవంతంగా పని చేసేందుకు, శాఖను మెరుగు పరచడంపై డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ వై నాగిరెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలు, రూట్ మ్యాప్‌పై చర్చించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాలకు చెందిన అగ్నిమాపక అధికారులు, ఇతర సీనియర్ అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ వర్షాకాలంలో సంసిద్ధత, బడ్జెట్ కేటాయింపులు, అగ్నిమాపక కేంద్రాల పునరుద్ధరణ పనులు, ఆధునిక అగ్నిమాపక, రెస్క్యూ పరికరాలు, వాహనాలు, విపత్తు ప్రణాళిక, ప్రాసిక్యూషన్ కేసుల స్థితి, వాహనాల పరిష్కారం మొదలైన వాటిపై మాట్లాడారు. అగ్నిమాపక శాఖను బలోపేతం చేసేందుకు 483 మంది సిబ్బందిని నియమించినట్లు నాగిరెడ్డి తెలిపారు.


Similar News