రుణమాఫీ పేరిట మరోసారి రేవంత్ సర్కార్ మోసం.. KTR సంచలన ట్వీట్

రుణమాఫీపై రేవంత్ సర్కారు తీరును ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు.

Update: 2024-07-18 04:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీపై రేవంత్ సర్కారు తీరును ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లించారని కేటీఆర్ ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఫోజులు కొడుతోందన్నారు. 40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా అన్నారు.

2014లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చిందని గుర్తు చేశారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ. 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకూ ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అర్హులైన అందరు రైతులకు రైతుబంధు విడుదల చేయాలని కోరారు.

Tags:    

Similar News