సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నంపై 'బానిస మంత్రులు' అంటూ Revanth Reddy రియాక్షన్

చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రావడం లేదని ఆందోళనతో కలెక్టరేట్ ఎదుట నిజామాబాద్ జిల్లా నందిపేట సర్పంచ్ దంపతుల ఆత్మహత్యయత్నం ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

Update: 2023-01-31 08:16 GMT

దిశ,డైనమిక్ బ్యూరో: చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రావడం లేదని ఆందోళనతో కలెక్టరేట్ ఎదుట నిజామాబాద్ జిల్లా నందిపేట సర్పంచ్ దంపతుల ఆత్మహత్యయత్నం ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఊరి కోసం అప్పు చేసి అభివృద్ధి చేసిన పాపాని ప్రభుత్వం ఈ స్థితికి తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లో ఏసీ రూముల్లో కూర్చుని సర్పంచ్‌లకు ఒక్క రూపాయి బాకీలేమని సిగ్గు ఎక్కులేకుండా ప్రకటించే బానిస మంత్రులు నందిపేట సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సర్పంచ్‌ల దుస్థితిని మరోసారి బహిర్గతం చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సర్పంచ్‌లు జీవితాలను బీఆర్ఎస్ ప్రభుత్వం బుగ్గిపాలు చేస్తోందని అప్పలు తెచ్చి చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నారని ఇకపైనా సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 

Tags:    

Similar News