సీఎం పక్కన ఉన్నోళ్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు! కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

రాజకీయ లబ్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-28 13:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ లబ్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ 4 లక్షల సిమ్ కార్డులు కొనుగోళ్ల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి ఉన్నారని, ఇది భయట పెడుతాననే తనకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. 4 లక్షల సిమ్ కార్డులు విద్యాసాగర్ రెడ్డి కొన్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని పెద్దన్న అని అన్నారని అది కాంగ్రెస్ పార్టీకి విరుద్దమన్నారు.

ప్రధాని మోడీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి శత్రువు అని, కాంగ్రెస్ పార్టీ ఖాతాలను సీజ్ చేయించారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌లో 4 లక్షల సిమ్ కార్డులు కోనుగోలు చేసిన విద్యాసాగర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఉంటే.. అది పార్టీకే పెద్ద విరుద్దమని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన అని తనకు షో కాస్ నోటీసులు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆత్మగౌరవం వదిలి బతకాలంటే తాను బతకలేనని ఈ సందర్భంగా అన్నారు. కాగా, తమకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడని.. పార్టీకి 34 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన సీనియర్ కాంగ్రెస్ దళిత నాయకుడు ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ కి షో-కాస్ నోటీసులు జారీ చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News