స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రిజర్వేష్ల పంపుపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు.

Update: 2024-07-15 13:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపనకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ పంచాయతీ‌రాజ్ శాఖపై సీఎం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్ల పెంపు అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా ఈ విషయంలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లోగా మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇప్పటికే కులగణనకు శ్రీకారం...

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి బీసీ కులాలకు న్యాయం చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం మార్చి నెలలో కులగణనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జీవో నెం. 26 జారీ చేసింది. ఇంతలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో ప్రక్రియ ఆలస్యం అవుతున్నది. ఈక్రమంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.

Tags:    

Similar News