సీఎం హోదాలో తొలి ఉద్యోగం ఆ యువతికే.. ఫైల్‌పై సంతకం చేయనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నాను. ఈ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు.

Update: 2023-12-06 08:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నాను. ఈ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం ఆరు గ్యారెంటీలపై చేస్తామని ఎన్నికల ప్రచారంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో ఓ దివ్యాంగ యువతికి కూడా తొలి ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు రేపు జరగబోయే ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం కల్పిస్తూ రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు. ఈ మేరకు ఆ యువతికి ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన రజిని దివ్యాంగురాలు. ఈమె పీజీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఏ ఒక్కటి రాలేదు. దివ్యాంగురాలని ప్రైవేట్ సంస్థలూ అవకాశం ఇవ్వలేదు. ఇక చివరి ప్రయత్నంగా ఎన్నికల సమయంలో గాంధీభవన్‌కు వెళ్లి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. చలించిపోయినా ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆ యువతి కల నెలవేరనుంది. రేపు ఎల్బీ స్టేడియంలో దివ్యాంగ యువతి రజినికి ఉద్యోగం కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు.

Tags:    

Similar News