నీ బిడ్డ ఇంటికి వస్తే ఆ నొప్పేంటో తెలుస్తుంది: కేసీఆర్‌పై రేవంత్ తీవ్ర విమర్శలు

సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2022-12-05 10:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తే కేసీఆర్‌కు, ఆయన కొడుకు కేటీఆర్‌కు ఎదురుండదని సీఎం అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేశావని.. ఆ పాపం ఊరికే పోదని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ చీలీకలు, పేలీకలుగా చీలిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తాండూర్ ఎమ్మెల్యేను, మరో 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసీఆర్.. ఇప్పుడమో తన పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్ర చేస్తున్నారంటూ వగల ఏడుపు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తనను అన్యాయంగా జైల్లో పెట్టి.. నా బిడ్డ లగ్నపత్రికకు కూడా వెళ్లకుండా చేశారని ఆరోపించారు.

ఇప్పుడు కేసీఆర్ బిడ్డ ఇంటికి సీబీఐ వచ్చిందని.. ఇవాళ నీ బిడ్డ ఇంటికి వస్తే కానీ ఆ నొప్పేంటో నీకు తెలుస్తుందని అన్నారు. తన పక్కనా ఉన్నవారు తనను సీఎం కావాలని అంటున్నారని.. కానీ, తాను సీఎం అయిన కాకపోయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రావాలన్నారు. ఏడాది గడువున్నప్పటికీ.. తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సీఎం కేసీఆర్ ఎన్నికల కోసం తొందర పడుతున్నాడని.. దీంతో కార్యకర్తలు అంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని రేవంత్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ముందు ఇక డిమాండ్లు పెట్టేది లేదని.. ఎవరి ఇంటి ముందుకెళ్లి బిచ్చం అడగాల్సిన అవసరం లేదన్నారు. 

Tags:    

Similar News