బ్రేకింగ్: భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన రేవంత్.. చార్మినార్ వద్ద హై టెన్షన్!
బీఆర్ఎస్ నుండి రూ.25 కోట్లు డబ్బు తీసుకున్నారంటూ ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు టీపీసీసీ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బయలుదేరారు.
దిశ, వెబ్‌డెస్క్: అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి రూ.25 కోట్లు డబ్బు తీసుకున్నారంటూ ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బయలుదేరారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుండి కార్యకర్తలతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కు పయనమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చార్మినార్ వద్ద భారీగా భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే.. రేవంత్‌పై ఆరోపణలు చేసిన ఈటల రాజేందర్.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేసేందుకు రావాలని రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు ఇప్పటి వరకు స్పందించలేదు.
దీంతో ఈటల రాజేందర్ వస్తారా.. రారా అని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, మునుగోడు ఉపఎన్నిక సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రూ. 25 కోట్లు తీసుకున్నాడని ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఈటల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండి పడుతుండగా.. బీజేపీ నేతలు సైతం అదే రీతిలో కౌంటర్ ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Read More: '‘రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్.. బెదిరించి దోచుకోవడమే అతని పని’’