సిట్ విచారణకు రేవంత్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

Update: 2023-03-23 04:23 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి వస్తున్న క్రమంలో పోలీసులు ఆ పార్టీకి చెందిన పలువురిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో మంత్రి కేటీర్ పీఏ తిరుపతి హస్తం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. మంత్రి పేషి నుంచే ఇదంతా జరిగిందన్న రేవంత్ రెడ్డి తిరుపతి స్వగ్రామం తాటిపర్తి పరిసరాలు ఊర్లల్లో ఉంటున్న పలువురు గ్రూప్ 1 పరీక్షల్లో వందకు పైగా మార్కులు సాధించినట్టు చెప్పారు.

సీబీఐ విచారణ జరిపితేనే అన్ని నిజాలు వెలుగు చూస్తాయని అన్నారు. ఈ క్రమంలో సిట్ అధికారులు ఇటీవల రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. లీకేజీకి సంబంధించి ఉన్న ఆధారాలను ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటలకు సిట్ ఆఫీస్‌కి రావాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు రావాలని పిలుపు ఇచ్చారు. దాంతో పోలీస్ ఉన్నతాధికారులు సిట్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, మల్లు రవి, బల్మూర్ వెంకట్, వీహెచ్.హనుమంతరావు తదితరులను ముందస్తుగా హౌస్ అరెస్ట్‌లు చేశారు.

Also Read: తెలంగాణ మళ్లీ దొరల పాలనలోకి..

Tags:    

Similar News

టైగర్స్ @ 42..