ప్రతీ గింజను కొనుగోలు చేసే వరకు పోరాటం:రేవంత్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు

Update: 2022-03-28 14:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి కాంగ్రెస్ ​శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం జరిగిన జూమ్ ఆప్ పో కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ ,ఐకేపీ సెంటర్ల వద్ద ధాన్యం కోనుగోలును డిమాండ్​ చేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. మార్చి చివరి వరకు అన్ని గ్రామాల్లో దీన్ని అమలు చేయాలన్నారు. అలాగే మండలాలు, నియోజక వర్గాలు, జిల్లా కేంద్రాలలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే విధంగా పోరాటాలు చేయాలన్నారు. సీనియర్ నాయకులు జిల్లాల్లో తిరిగి ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేసి సమస్యలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలన్నారు.

అంతేగాక ఏప్రిల్ చివరిలో వరంగల్ లో నిర్వహించే రైతు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. దీంతో పాటు ఏఐసీసీ ఆదేశాల మేరకు పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల పెంపు లను నిరసిస్తూ మార్చి 31 కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్లలో గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి నిరసన వ్యక్తం చేయాలన్నారు. 2 నుంచి 4వ తేదీ వరకు ధరల పెంపును నిరసిస్తూ మండలాలు, నియోజకవర్గాల్లో జిల్లాలో ఉద్యమాలు నిర్వహించాలన్నారు. 7వ తేదీన సివిల్ సప్లయ్, ఇటు విద్యుత్  సౌధ వద్ద భారీ ధర్నా చేపట్టాలన్నారు. జిఓ 111 విషయంలో కేసీఆర్ ఒక ఆస్పష్ట ప్రకటన చేశారని, ఈ విషయంలో 111 జిఓ తొలగించడానికి తీసుకున్న నిర్ణయాలపై ఒక విధాన ప్రకటన చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో డిజిటల్ మెంబెర్షిప్ 40 లక్షల పై చిలుకు సాధించడంలో కార్యకర్తలు, నాయకులు, ప్రధానంగా డిజిటల్ మెంబెర్షిప్ ఎన్ రోలెర్స్ కృషి ప్రశంసనీయమని హర్షం వ్యక్తం చేశారు.ఈ సమవేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు..

Tags:    

Similar News