Revanth Reddy: విజయ్ దివస్ సందర్భంగా అమరులకు సీఎం ఘన నివాళులు
విజయ్ దివస్(Vijay Divas) సందర్భంగా అమర జవానులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) నివాళులు(Tributes) అర్పించారు.
దిశ, వెబ్ డెస్క్: విజయ్ దివస్(Vijay Divas) సందర్భంగా అమర జవానులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) నివాళులు(Tributes) అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ప్రత్యేక పోస్ట్(Special Post) పెట్టారు. దీనిపై భారత త్రివిధ దళాల పరాక్రమం, అంకిత భావం మనందరికీ గర్వకారణమని అన్నారు. 1971 యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి విజయానికి కారకులైన వీర జవానుల సేవలను స్మరిస్తూ విజయ్ దివస్ సందర్భంగా అమర సైనికులకు రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. కాగా 53 ఏళ్ల క్రితం తూర్పు పాకిస్థాన్ లో మొదలైన స్వతంత్ర తిరుగుబాటు పోరు భారత్, పాకిస్థాన్ ల మధ్య యుద్దానికి దారి తీసింది. 1971 లో జరిగిన ఈ యుద్దంలో దేశ చరిత్రలో లిఖించదగిన విధంగా పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ కు విముక్తి లభించింది. ఈ విజయానికి గుర్తుగా ఇండియాలో ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ గా జరుపుతున్నారు.