నేడు ఎన్నికల సంఘాన్ని కలవనున్న రేవంత్ రెడ్డి, భట్టి.. ఎందుకంటే..?
నేడు ఎన్నికల సంఘాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కలవనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: నేడు ఎన్నికల సంఘాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కలవనున్నారు. ప్రస్తుత ప్రభుత్వ కార్యకలాపాలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేయనుంది. ఆర్థిక, విధాన నిర్ణయాలపై దృష్టి సారించాలని ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలిసింది. ఇవాళ సీఈవో వికాస్ రాజ్‌ను కాంగ్రెస్ బృందం కలవనుంది. ప్రస్తుత ప్రభుత్వం రైతుబంధు నిధులను మళ్లిస్తోందని కాంగ్రెస్ ఫిర్యాదు చేయనుంది. రైతుబంధు నిధులను గుత్తేదారుల బిల్లులకు మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు కుట్ర జరుగుతోందని ఫిర్యాదు చేయనుంది. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరనుంది.