ఇటు చూడండి! ఉద్యమంలో సీఎం రేవంత్ అరెస్ట్! ఇప్పుడు ఫోటోలు వైరల్.. ఎందుకంటే?

జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2024-05-30 08:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో తెలంగాణ అధికారిక చిహ్నం, జయ జయహే తెలంగాణ పాటను అధికార రాష్ట్ర గీతంగా ప్రకటించనుంది. అయితే కొత్త అధికారిక చిహ్నం, రాష్ట్ర గీతం బాధ్యతలు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఇవ్వడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం చార్మినార్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, ఆయనకు తెలంగాణ చరిత్ర గురించి తెలియదని ఆరోపించారు. మరోవైపు ‘తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌రెడ్డి పాత్ర ఏమిటో చెప్పాలి?’ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ శ్రేణులు దీటుగా స్పందిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సకల జనుల సమ్మెలో భాగంగా రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న ఫోటోలను బీఆర్ఎస్ నేతలకు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేస్తున్నారు. ఇది చూడండి అంటూ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఎడిట్ చేసిన ఫోటోలు అని బీఆర్ఎస్ శ్రేణులు ఖండిస్తున్నాయి. 

Tags:    

Similar News