Ugadi: ఉగాది నుంచి మట్టి పాత్రలు వాడండి.. గవర్నర్, సీఎంలకు పంపిణీ చేసిన బీసీ సంక్షేమ శాఖ
ప్రజలు మట్టి పాత్రలు వాడండి.. ఆరోగ్యాన్ని రక్షించుకోండి.. కుల వృత్తులు కాపాడండి.. అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలు మట్టి పాత్రలు వాడండి.. ఆరోగ్యాన్ని రక్షించుకోండి.. కుల వృత్తులు కాపాడండి.. అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. విశ్వావసు నామ (Ugadi) ఉగాది పండుగ సందర్భంగా శాలివాహన కుమ్మరి సంఘం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, మంత్రులకు, ఇతర ముఖ్య నేతలకు ఉగాది పండగకు ఉపయోగపడే కుండ మట్టి పాత్రలను బీసీ సంక్షేమ శాఖ (BC Welfare Department) పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఉగాది నుంచి మట్టి పాత్రలను వాడాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కుల వృత్తులను ప్రోత్సహించాలని వెల్లడించారు.
ఇదిలా ఉండగా మంత్రి పొన్నం ప్రభాకర్ మరో ట్వీట్ చేశారు. దేశంలోనే మొదటి సారి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతోందిని, రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం వస్తాయని గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే గ్రామాల్లో ఏ సమస్య ఉన్న గ్రామ కార్యదర్శి ద్వారా జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని, సమస్య పరిష్కారం కాకపోతే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.