అత్యంత శక్తిమంతుల జాబితాలో నేతల పేర్లు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025 సంవత్సరానికి గానూ 100 మంది ప్రముఖులతో భారతదేశంలోని అత్యంత శక్తిమంతుల జాబితా విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (Indian Express) 2025 సంవత్సరానికి గానూ 100 మంది ప్రముఖులతో భారతదేశంలోని అత్యంత శక్తిమంతుల జాబితా (Most Powerful People List) విడుదల చేసింది. ఇందులో ప్రధాని మోడీ (PM Narendra Modi) అగ్రస్థానం దక్కించుకోగా.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) 14వ స్థానంలో ఉండగా.. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 28వ స్థానంలో ఉన్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే రేవంత్ రెడ్డి 11 స్థానాలు ఎగబాకి పైకి చేరుకున్నారు. దీంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలకు కాంగ్రెస్ నేతలు (Congress Leaders) శుభాకాంక్షలు (Wishes) చెబుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Congress MLC Addanki Dayakar) ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. భారత దేశంలో అత్యంత శక్తి వంతమైన నేతలుగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు ఎదగడం గర్వకారణమని అన్నారు.
దేశంలో ప్రతిపక్ష నేత (Opposition Leader) గా ఎన్నో కష్టాలను ఓర్చుకొని కాంగ్రెస్ పార్టీకి సేవచేస్తూ.. 9వ ర్యాంక్ సాధించిన రాహుల్ గాంధీకి, సంవత్సరం క్రితమే ముఖ్యమంత్రి అయి శక్తివంతమైన నేతగా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి పేరు తెస్తున్న రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నీతిగా, నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టి ఇది సాధ్యం అయిందని తెలిపారు. అంతేగాక కాంగ్రెస్ పార్టీ మరొక సారి పునరంకితం అవుతున్న తరుణంలో దేశంలో, రాష్ట్రంలో ఈ అవార్డులు రావడం చాలా గొప్ప పరిణామం అని చెప్పారు. ఇక ఈ స్పూర్తితో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు కృషి చేయాలని కాంగ్రెస్ నేత విజ్ఞప్తి చేశారు.