Revanth: కేబినెట్ భేటీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్

ఆర్ధిక ఇబ్బందులు ఎన్నున్నా.. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(M Revanth Reddy) అన్నారు.

Update: 2025-01-04 16:39 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆర్ధిక ఇబ్బందులు ఎన్నున్నా.. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. శనివారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ(Cabinet Meeting)పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. గత పాలకులు మోపిన అప్పుల భారం ఎంతున్నా.. అన్నదాతకు ఇచ్చిన మాట.. కర్షక లోకానికి చేసిన బాస.. ఆరునూరైనా నిలబెట్టుకోవాలన్న తపన ఉన్నదని అన్నారు. అలాగే ఈ నూతన సంవత్సరంలో(New Year) రైతన్న జీవితంలో వెలుగులు నింపాలన్న పట్టుదలతో.. ఈ రోజు కేబినెట్ సమావేశంలో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.

తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ “రైతు భరోసా”(Raithu Bharosa) ఇవ్వాలని నిర్ణయించామని, ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు రైతు భరోసా.. భూమి లేని ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా”(Indhiramma Athmiya Bharosa) పథకం కింద రూ.12 వేలు.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు(Ration Cards) ఇస్తామని అన్నారు. ఇక రైతులు, పేదలకు ప్రయోజనం చేకూర్చే ఈ మూడు పథకాలను గణతంత్ర దినోత్సవం(Republic day) సందర్భంగా.. జనవరి 26, 2025 నుండి అమలు చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను అని సీఎం రాసుకొచ్చారు.

Tags:    

Similar News