రాష్ట్ర 12వ బెటాలియన్‌‌లో వింత.. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు: RS Praveen kumar

నల్లగొండ జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర 12వ బెటాలియన్‌ (12th Battalion)వద్ద.. పోలీసుల భార్యలు ధర్నా నిర్వహించారు.

Update: 2024-10-23 12:07 GMT

దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర 12వ బెటాలియన్‌ (12th Battalion)వద్ద.. పోలీసుల భార్యలు ధర్నా నిర్వహించారు. వారి భర్తలపై పనిభారం తగ్గించాలని, అర్దర్లి వ్యవస్థను రద్దు చేయాలని, కామన్ మెస్ తీసివేయాలని, రూల్ కాల్ వ్యవస్థను సివిల్ ఆర్ మాదిరిగానే పెట్టాలని, కొత్తగా వచ్చే రికార్డు పద్ధతి ఉపసంహరించుకోవాలని బెటాలియన్ కార్యాలయం ముందు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆరుగురు పోలీసులను బెటాలియన్ పోలీసు ఉన్నత అధికారి ఆఫీస్ కమాండింగ్ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటని అడిగితే.. ‘మీ భార్యలు ధర్నా చేశారు.

అందుకే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం’ అని చెప్పారు. కాగా ఈ ఘటనపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar) స్పందించారు. భార్యలు ఆందోళన చేస్తే కానిస్టేబుల్‌లను సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదని.. కానిస్టేబుల్ భార్యలు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి శాంతియుతంగా నిరసన తెలిపుతుంటే ఆరుగురు కానిస్టేబుల్‌లను సస్పెండ్ చేశారని విమర్శించారు. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్లను వెంటనే డ్యూటీ లోకి తీసుకోవాలి బీఆర్ఎస్(BRS) పార్టీ డిమాండ్ చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News