హైదరాబాద్ రిసార్ట్‌లో వ్యూహాలు! ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు కీలక భేటీ!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఆసక్తిగా మారుతున్నాయి. ప్రధానంగా టీడీపీ-జనసేన కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఆసక్తిగా మారుతున్నాయి. ప్రధానంగా టీడీపీ-జనసేన కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి గెలవకుండా నిలువరించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. జనసేన పార్టీకి మిత్రపక్షమైన బీజేపీని తమ కూటమిలోకి చేర్చుకోవాలని టీడీపీ-జనసేన భావించింది. కానీ ఏపీ బీజేపీ ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయినట్లు సమాచారం.
రిసార్ట్‌లో వ్యూహరచనలు!
హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ప్రశాంత్ కిషోర్‌ను చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి భేటీ కలిసినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారి మధ్య సుమారు 4 గంటల పాటు సమావేశమయ్యారని తెలిసింది. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నాయకత్వానికి చివరి రెండు వారాలు కొన్ని సలహాలిచ్చినట్లు ప్రచారం జరిగింది. అభ్యర్థుల జాబితా, బీజేపీ పొత్తుల విషయం, ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై చర్చించినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత డిసెంబర్ మూడో వారంలో మొదటి సారి టీడీపీ అధినేత చంద్రబాబుతో పీకే సమావేశమయ్యారు. దాదాపు మూడుగంటల మీటింగ్ తర్వాత త్వరలోనే మళ్లీ వస్తానని పీకే చెప్పిపోయారు. దాదాపు మూడు నెలలుగా ఆయన టీడీపీ అగ్రనేతలకు టచ్‌లో ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పీకేతో భేటి కావడంపై పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.
చంద్రబాబుతో రెండు సార్లు మంతనాలు!
కాగా, 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జగన్ తరపున పనిచేసిన పీకేపై బీహార్ డెకాయిట్ అంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. తర్వాత ఎన్నికల వ్యూహాల కోసం ఎంతో రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు రెండుసార్లు పీకేతో భేటీ అవ్వడం ఆశ్చర్యమేస్తుందని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సర్వేలో పార్టీకి భారీ షాక్?
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ గురువారం మీడియాతో ప్రశాంత్ కిషోర్ సర్వే గురించి మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో వైసీపీకి భారీ షాక్ తగిలిందని తెలిపారు. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన ఆ పార్టీకి ఈ సారి 40 సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ నివేదిక అందించిందని వెల్లడించారు. జనసేన, టీడీపీ పొత్తుతో 25 ఎంపీ, 150 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.
Read More..
తంతే మూడు జిల్లాల అవుతల పడ్డాడు.. మాజీమంత్రిపై చంద్రబాబు ఫైర్