యాదాద్రి ఆలయ ప్రసాదంలో వాడే నెయ్యి స్వచ్ఛమైనదే.. రిపోర్ట్ విడుదల

యాదాద్రి ఆలయ(Yadadri temple) ప్రసాదం తయారీలో వాడే నెయ్యి నాణ్యత రిపోర్ట్‌ను బుధవారం అధికారులు విడుదల చేశారు.

Update: 2024-10-16 11:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి ఆలయ(Yadadri temple) ప్రసాదం తయారీలో వాడే నెయ్యి నాణ్యత రిపోర్ట్‌ను బుధవారం అధికారులు విడుదల చేశారు. యాదాద్రి ఆలయంలో వాడే నెయ్యి స్వచ్ఛమైనదే అని తేల్చి చెప్పారు. 40 ఏళ్లుగా మదర్ డైరీ నెయ్యినే వాడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతోనే నెయ్యిని ల్యాబ్‌కు పంపించామని యాదగిరిగుట్ట ఈవో భాస్కర రావు తెలిపారు. కాగా, ఇటీవల తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని రిపోర్ట్‌లో తేలడంతో రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించి ఖండించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని పలు ఆలయాల ప్రసాదాల్లో వాడే నెయ్యిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపించారు. అదే క్రమంలోనే యాదాద్రి ఆలయ ప్రసాదంలో వాడే నెయ్యిని కూడా పరీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించి ల్యాబ్‌కు పంపించింది.


Similar News