Sridhar Babu: స్టెరిలైట్ కంపెనీతో టీ ఫైబర్ ఎంవోయూ.. యువతకు శ్రీధర్ బాబు గుడ్ న్యూస్

రాష్ట్ర యువతకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2024-10-16 12:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్టెరిలైట్ అనే కంపెనీతో టీ ఫైబర్ ఎంవోయూ కుదుర్చుకుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. దీనివల్ల వందలాది మంది యువతకు శిక్షణ పొందబోతున్నారని తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందినవారు టెలికాం ఇండస్ట్రీలో ఉపాధి దక్కించుకోబోతున్నారని చెప్పారు. నైపుణ్యాల చొరవ విషయంలో ఈ ఎంవోయూ తమ ప్రభుత్వం తీసుకున్న మరో ప్రధాన నిర్ణయమని పేర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫైబర్ కనెక్టివిటీ కోసం రూ.1600 కోట్లు, చివరి మైల్ స్టోన్ వరకు ఫైబర్ కనెక్టివిటీ అందించేలా అటవీ శాఖ నుంచి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియాను కోరినట్లు చెప్పారు. హైదరాబాద్- బెంగళూరు మధ్య ఏఐ కారిడార్ నిర్మించబోతున్నామని, యువతకు నైపుణ్య శిక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, రాష్ట్ర ఖజానా అంతా వడ్డీలు కట్టడానికే సరిపోతుందని పేర్కొన్నారు.


Similar News