రైతులకు శుభవార్త.. సాగునీరు విడుదల

నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేశారు. శుక్రవారం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు.

Update: 2024-08-02 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేశారు. శుక్రవారం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు. కాగా, ఇప్పటికే కుడి కాల్వ ద్వారా 5,944 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీశైలం జలాశయం నుంచి భారీ వరద నీటి రాకతో సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండగా, ఎడమకాలువ ఆయకట్టుకు నీటి విడుదల చేశారు. దీంతో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని ఆయకట్టు రైతాంగం పంటల సాగుకు సాగునీరందనుంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..