బీర్ల అమ్మకాల్లో రికార్డు.. ఎండలకు ఫుల్‌గా తాగేసిన మందుబాబులు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో పెరిగిపోయి.. తెలంగాణ ఎక్సైజ్‌శాఖకు భారీ ఎండలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో పెరిగిపోయి.. తెలంగాణ ఎక్సైజ్‌శాఖకు భారీ ఎండలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మే 1 వ తారీఖు నుంచి 18 వరకు తెలంగాణలోని మందుబాబులు తాగిన బీర్ల సంఖ్య తెలిస్తే షాక్ అవుతారు. కేవలం 10 రోజుల్లోనే.. ఏకంగా.. 4.23 కోట్లు బీర్లను మందుబాబులు తాగేశారు. దీంతో ఎక్సైజ్‌శాఖకు కేవలం బీర్ల అమ్మకం ద్వారానే 583కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
ఇదంతా ఒక లెక్క అయితే నల్లగొండ జిల్లా బీర్ల అమ్మకాలు మరో లెక్క.. కేవలం నల్లగొండ జిల్లాలోనే 18 రోజుల్లో 3.36 లక్షల బీర్లు తాగినట్లు తెలుస్తుంది. మే నెల కావడం ఎండలు ఎన్నడు లేనంతగా దంచి కొడుతుండటంతో మందుబాబు, బార్లు, వైన్స్‌ల బాటలు పడుతున్నారు. దీంతో తెలంగాణలో బీర్ల అమ్మకాల్లో నల్గొండ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా కరీంనగర్ రెండో స్థానంలో నిలిచింది. ఎండల తీవ్రతలు ఇలాగే కొనసాగితే.. బీర్ల అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డులు బద్దలయ్యేలా కనిపిస్తున్నాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది.