ఓటర్ల జాబితా సవరణలో పార్టీ శ్రేణులు భాగస్వాములవ్వాలి.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల

ఓటర్ల జాబితా సవరణలో టీడీపీ శ్రేణులు భాగస్వామ్యం కావాలని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2023-07-18 13:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఓటర్ల జాబితా సవరణలో టీడీపీ శ్రేణులు భాగస్వామ్యం కావాలని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఓటర్ల నమోదుపై సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 జూన్ 1నాటికి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్ జాబితాలో చేర్పించాలన్నారు. అనర్హులైన ఓటర్లను తొలగించేందుకు శ్రేణులు కృషి చేయాలని, ప్రతి బూత్ లెవల్లో పార్టీకి ఏజెంట్లను తయారు చేసుకోవాలని తెలిపారు. ఇదే రీతిన రాష్ట్రంలోని ఇతర పార్లమెంట్ నియోజకవర్గాలలోనూ పార్టీ శ్రేణులు ఓటరు జాబితా సవరణలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 25న అన్ని పార్లమెంట్ నియోజక వర్గాల పార్టీ కమిటీల ముఖ్య నాయకులతో లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సమావేశం నిర్వహించ నున్నట్లు తెలిపారు. పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజునాయక్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు ఎం. సాయి తులసి, పెద్దోజు రవీంద్రాచారి, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్, సికింద్రాబాద్ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు పి. సాయిబాబా, ఆదిలాబాద్ పార్టీ అధ్యక్షుడు జి. ఆనంద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శులు నల్లెల కిషోర్,పి. బాలరాజుగౌడ్,పార్టీ రాష్ట్ర నాయకులు షేక్ ఆరిఫ్, జివిజి నాయుడు, నాంపల్లి నియోజకవర్గ పార్టీ కో-ఆర్డినేటర్ బాలకృష్ణ, పార్టీ నాయకులు ప్రశాంతి యాదవ్, చేవెళ్ల పార్లమెంట్ పార్టీ నాయకులు బి. జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News