Revanth Reddy: నీ త్యాగం పచ్చబొట్టై శాశ్వతంగా నిలుస్తోంది.. సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంత చారి(Srikantha Chary) వర్ధంతి(Death Anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులు(Tribute) అర్పించారు.

Update: 2024-12-03 07:19 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంత చారి (Srikantha Chary) వర్ధంతి (Death Anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులు(Tribute) అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆయన ఫోటోతో కూడిన పోస్ట్ పెట్టారు. దీనిపై రేవంత్ రెడ్డి.. నీ త్యాగం తెలంగాణ గుండెలపై పచ్చబొట్టై శాశ్వతంగా నిలుస్తోందని కీర్తించారు. అలాగే శ్రీకాంత చారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి తెలియజేశారు. కాగా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి (Osmania University Student) గా ఉన్న ఉద్యమకారుడు శ్రీకాంత చారి 2009 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో రాష్ట్ర సాధనకై ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహుతి చేసుకొని మరణించాడు.

Tags:    

Similar News