సామాన్యులకు భారీ షాక్.. రాష్ట్రవ్యాప్తంగా ఆ దుకాణాలు బంద్!

ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా బియ్యం అందజేస్తుంది.

Update: 2023-06-05 10:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా బియ్యం అందజేస్తుంది. వాటితో పాటు పప్పులు, నూనె వంటి ఇతర సరుకులు సైతం తక్కువ ధరకే అందజేస్తారు. అయితే ఈ రేషన్ మొత్తాన్ని ప్రజలకు అందించడంలో డీలర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. కానీ.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు నిరసనకు దిగారు. డీలర్లకు గౌరవ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. రేషన్ షాపులు బంద్ చేసి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించెవరకు రేషన్ సరుకులు పంపిణీ చేయయని ప్రకటించారు. దీనిపై స్పందించిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.. డీలర్లు మొండి వైఖరి సరికాదని.. నిరసన విరమించి విధుల్లో చేరకపోతే ఐకేపీ సెంటర్ల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News