అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న : ఎమ్మెల్యే

నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్న అని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-14 14:29 GMT

దిశ, పరిగి : నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్న అని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి శనివారం రాత్రి తన నివాసంలో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పరిగి నియోజకవర్గానికి సుమారు రూ.7333 కోట్ల అభివృధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు.

రేపు పరిగి కూల్కచెర్ల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పరిగి పట్టణానికి, కుల్కచర్లకు వచ్చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు.


Similar News