గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే కసిరెడ్డి

గౌడ కులస్తుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

Update: 2024-11-12 12:35 GMT

దిశ,ఆమనగల్లు ::- గౌడ కులస్తుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో మాడ్గుల,కడ్తాల్ మండలాల గౌడ కులస్తుల వృత్తి సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నియోజకవర్గం లోని గౌడ గీత కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన గీత కార్మికులకు లైసెన్సులు మంజూరు చేస్తామని, రక్షణ కిట్లు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా గౌడ గీత కార్మికులు ఎమ్మెల్యే నారాయణరెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్య నాయక్, మండల అధ్యక్షులు బిచ్య నాయక్, నాయకులు రాములు, నరసింహ, యాదయ్య,వెంకటయ్య,అంజయ్య,వెంకటేష్, శేఖర్, సుమన్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News