మహేశ్వరం మహిళలదే.. కీలక పదవుల్లో నారీ మణులు

దిశ, మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో మహిళ ప్రజాప్రతినిధులే ఎలుతున్నారు.

Update: 2022-03-07 07:39 GMT

దిశ, మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో మహిళ ప్రజాప్రతినిధులే ఎలుతున్నారు. మహేశ్వరం అంటే మహిళలే అన్నట్టు, ఉన్నతమైన పదవులలో ఉంటూ,పురుషుల కంటే ధీటుగా తమ పదవులకు వన్నె తెస్తూ తమదైన శైలిలో పరిపాలన చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గం కేంద్రం నుంచి ఎమ్మెల్యే గా సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం మండలం జెడ్పీటీసీ‌గా తీగల అనితా రెడ్డి, మహేశ్వరం వైస్ ఎంపీపీ‌గా సునీత, మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సురసాని వరలక్ష్మి,, కందుకూరు ఎంపీపీ మంద జ్యోతి, కందుకూరు వైస్ ఎంపీపీ గంగుల శమంత, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా చిగురింత పారిజాత, మీర్ పేట్ కార్పొరేషన్ మేయర్‌గా దుర్గ, ఆర్కే పురం కార్పొరేటర్ రాధ, సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వీరితో పాటు నియోజకవర్గంలో స్థానిక సంస్థలలో మహిళ ప్రజా ప్రతినిధులు సర్పంచులు గా ,ఎంపీటీసీలు‌గా,కౌన్సిలర్స్ గా, కార్పొరేటర్లు గా చాలా మంది మహిళా నారీమణులు ప్రజాప్రతినిధులు‌గా కొనసాగుతున్నారు. పురుషుల కంటే దీటుగా తమదైన శైలిలో పరిపాలన చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్లన నియోజకవర్గంలో మహిళ మణులే కీలకమైన పదవులలో కొనసాగుతున్నారు. నియోజకవర్గం కేంద్రం నుంచి ఎమ్మెల్యే గా ఉన్న సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా తమదైన శైలిలో పరిపాలన చేస్తూ దేశంలోనే మహిళ మంత్రిగా మంచి గుర్తింపు పొందిన మహిళ ప్రజాప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయములో హోంశాఖ మంత్రిగా ఉంటూ, శాంతి భద్రతలను కాపాడటంలో తమదైన శైలిలో కృషిచేశారు. మహిళ ప్రజాపతినిధిగా ప్రజల చేత పేరు తెచ్చుకున్నారు. దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మహిళా మంత్రిగా, ప్రజాప్రతినిధిగా దేశ,రాష్ట్ర ప్రజలచేత గుర్తింపు పొందారు. మహేశ్వరం మండలం నుంచి జెడ్పీటీసీ‌గా గెలిచి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా తీగల అనితా రెడ్డి, మహిళ ప్రజాపతినిధిగా ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో డాక్టర్ గా పనిచేసి, టీఆర్ఎస్ పార్టీలో జిల్లా మహిళ అధ్యక్షురాలు‌గా పనిచేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. మహిళలు అంటే ఒక్కపుడు వంటకే పరిమితం అయ్యేవారు నేడు అవకాశాలు వస్తె ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలోనూ తమ సత్తాను చాటుతున్నారు.పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు మహిళ ప్రజాప్రతినిధులు తమ దైన శైలిలో పరిపాలన చేస్తున్నారు.


 



మహిళలల్లో పట్టుదల కృషి ఉంటే ఏ రంగంలోనైనా ముందజలో ఉండొచ్చు.

నేను మహిళను నాతోని ఏ పని సాధ్యం కాదు అనే ఆలోచనలను తన మనసులో నుంచి తీసివేసినప్పుడు మహిళలు అన్ని రంగాలలో పురుషుల కంటే దీటుగా ముందజలో ఉంటారానీ,నేడు విద్య,రాజకీయ ,క్రీడా రంగాలలో మహిళలు పోటీ పడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలు ప్రజాప్రతినిధులు గా పదవులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకవస్తున్నారన్నారు.

కందుకూరు ఎంపీపీ మంద జ్యోతి..




 



సీఎం కేసీఆర్ ఆడపిల్లల కోసం కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి పథకం, షీ టీమ్స్, స్థానిక సంస్థల ఎన్నికలల్లో 50 శాతం రిజర్వేషన్లను కల్పించాడు.

సురసాని వరలక్ష్మి మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్




 

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు స్థానిక సంస్థలలో 50శాతం రిజరేషన్లు కల్పించడం‌తో మహిళలు కూడా రాజకీయంగా ఎదుగుతున్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఏ రంగంలోనైనా ముందజలో ఉండొచ్చు,తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళ ల అభివృద్ధికి కృషి చేస్తుంది.

మునావత్ సాలీ గంగారం గ్రామ సర్పంచ్

Tags:    

Similar News