ఎమ్మెల్యే ఆనంద్ టెక్స్ టైల్స్ పార్కులను తేగలడా : మాజీ మంత్రి ప్రసాద్ కుమార్
దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయి, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ పని అయిపోయిందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
దిశ ప్రతినిధి, వికారాబాద్ : దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయి, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ పని అయిపోయిందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని రాళ్లచిట్టెంపల్లి గ్రామంలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ పర్యటించారు. ఈ సందర్బంగా ఇంటింటికి దిరిగిన ఆయన ఈసారి కాంగ్రెస్ పార్టీని, నన్ను ఆదరించాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకోసం పనిచేసే పార్టీ అని, అభివృద్ధి చేసే పార్టీ అని అన్నారు. మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరల నుండి నిత్యావసర ధరలు అన్ని పెంచి సామాన్యుల జీవితాలతో ఆడుకుంటుంది అన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిత్యావసర ధరకు తక్కించడమే కాక, గ్యాస్ కేవలం రూ.500 లకే ఇంటికి చేసారుస్తాం అన్నారు.
ఇక కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు రావాల్సిన పథకాలు మొత్తం ఆపేసి వారిని రోడ్డుమీద పడేసాడు. పైగా ఊరూరా బెల్ట్ షాపులు పెంచిన కేసీఆర్, మద్యం తాగి సంసారాలు ఆగం చేసుకోండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు అన్నారు. కంటివెలుగు కార్యక్రమం కేవలం ఎన్నికల్లో కారు గుర్తు కనిపించడానికి మాత్రమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపిస్తే ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, భార్య భర్తలు ఇద్దరికీ రూ.2500 చొప్పున పెక్షన్ ఇస్తాం అన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే పెక్షన్ ను ఎవ్వరు ఆపడానికి లేదని, బీఆర్ఎస్ పార్టీ కావాలని అసత్య ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన ఫీజు రియింబర్స్‌మెంట్ రూ.5000 కోట్ల బకాయిలు ఏకకాలంలో చెల్లిస్తామన్నారు. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు, ఏడాదికి రూ.15,000 చెప్పున ఒకేసారి రైతుబంధు డబ్బులు, లావని పట్టాలను అమ్ముకోవడానికి హక్కు కలిపిస్తూ జీవో తేవడమే కాకా, ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తెలిపారు.
ఎమ్మెల్యే టెక్స్ టైల్స్ పార్కులను తీసుకురావాలి : మాజీ మంత్రి ప్రసాద్ కుమార్
స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గానికి నిధులు తేవడం మరిచి, మీతో నేను అంటూ గ్రామాలలో తిరుగుతూ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. వచ్చే ఎన్నికలు వచ్చేలోపు ఎమ్మెల్యేకు రియల్ ఎస్టేట్ ఆనంద్ అనేపేరు వస్తుంది. ఎమ్మెల్యే ఇప్పటికే జీరో అయిపోతాడు. ఏం చేయకూడదో అది చేస్తూ, ఎం చేయాలో అది చేయడం లేదు. నేను ఎప్పుడో తెచ్చిన 2 టెక్స్ టైల్స్ పార్కులను తీసుకురావాలన్నారు. వికారాబాద్ కు ఒకటి మర్పల్లికి ఒకటి రెండు టెక్స్ టైల్స్ పార్కులు మంజూరు అయ్యాయి. ఆ ఫైల్ కేటీఆర్ దగ్గరే ఉంది. ఎమ్మెల్యేకు చేతనైతే ఆ రెండు పార్కులను తీసుకొస్తే 8000 మంది మహిళలకు ఉపాధి కల్పించవచ్చు అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.