జనంలోకి అటవీ జంతువులు..
అడవులు విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో జంతువులకు ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయి. వీధి కుక్క,పెంపుడు జంతువులు లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి.
దిశ, తాండూరు రూరల్ : అడవులు విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో జంతువులకు ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయి. వీధి కుక్క,పెంపుడు జంతువులు లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. అటవీ జంతువులు జనవాసాల్లోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాండూరు మండలం లో వరుసగా అడవి జంతువులు ఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇక కంటికి కనిపించకుండా తిరుగుతూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాండూరు మండలంలో జంతువులు సంచరించడం తో జనం భయంతో వణికిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టడం లేదని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు.
చిరుత పులి పిల్ల మృతి.. కుక్క పై దాడి చేసిన ఎలుగుబంటి.. హైనా సంచార..!
ఈనెల 1వ తేదీన తాండూరు మండలం కోటబాష్పల్లి గ్రామ సమీపంలో గాయాలపాలై ఉన్న చిరుతపులి పిల్లను చూసి స్థానిక యువకులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ శాఖ అధికారుల బృందం దాన్ని కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో పశువైద్యాధికారి చికిత్స అందించారు. కొద్ది సేపటికే చిరుత పులి పిల్ల మృతి చెందింది. 48,50గంట క్రితమే ఇది జన్మించి ఉండంతో ఎండలో డీహైడ్రేషన్ కు గురై మృతి మృతి చెందినట్లు పశువైద్యాధికారిణి తెలిపారు.
అదే మండలంలోని బేల్కటూరు గ్రామంలో ఈనెల 14న ఎలుగుబంట్లు, హైనా లు సంచారం కలకలం రేపింది. ఎలుగుబంటి పిల్లలతో సంచరిస్తుండగా గమనించిన వీధి కుక్కలు మొరుగుతా ఎగబడటంతో ఎలుగుబంటి ఒక క్కుక పై దాడి చేసింది. దీంతో ఆ కుక్క నోటీ భాగంపై తీవ్రంగా గాయమైంది. కుక్కల అరుపులకు పాలిషింగ్ యూనిట్లో పని చేసే కార్మికులు బయటికి వచ్చారు. దీంతో ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది. సమాచారం తెలుసుకున్న కరణ్ కోట్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎలుగుబంట్లు, హైనానా అని జంతువు మలవిసర్జన ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు.
తలదాచుకునే మార్గం లేక..
జిన్గుర్తి, తట్టేపల్లి, అడ్డిగాచర్ల,అంతారం ప్రాంతాల్లో అడవులు అంతరించిపోతున్నాయి.. చిన్న చిన్న పొదలన్ని నేలకొరిగాయి.. కర్ణాటక రాష్ట్రంలో కూడా దారుణంగా నాశనమయ్యాయి. దీంతో ఎలుగుబంట్లు,హైనా అడవి పందులు తలదాచుకునేందుకు మార్గాలు లేకుండా పోయాయి. బయటకు వస్తున్న వన్యప్రాణులు మనుషులు తమకు ఎక్కడ హానీ తలపెడతారోనని ఎదురుదాడి చేస్తున్నాయి. అటవీశాఖ అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. చిరుత పులి పిల్లలు, ఎలుగు బంట్లు, హైనా, జింకలు, ఇతర జంతువుల సంరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. అసలు తాండూరులో అరుదైన పక్షులు, జంతువులు ఎన్ని ఉన్నాయో గణన చేయలేని స్థితిలో అటవీశాఖ యంత్రాంగం ఉందని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
సాసర్లు నిర్మించాలి
సాధారణంగా నీరున్న ప్రాంతాల్లోనే వన్యప్రాణుల సంచారం అధికంగా ఉంటుంది. కానీ ఇటీవల అడవులు, కొండ ప్రాంతాల్లో నీరు లేకపోవడంతో వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. అందుకే అడవులు, కొండ ప్రాంతాల్లో చెలమలు, ఫైర్‌లైన్స్, సాసర్ పీట్లను ఏర్పాటు చేయాలి. నిఘా వలయాలు ఏర్పాటు చేస్తే వన్యప్రాణుల కదలికలను తెలుసుకోవచ్చు. వేటగాళ్లను నియంత్రించవచ్చు. సాసర్లు నిర్మించాలి. ఏటా వేసవిలో ట్యాంకర్లతో సాసర్లను నింపితే వన్యప్రాణుల దాహార్తిని తీర్చవచ్చు. సోలారు పంపుసెట్లు ఏర్పాటు చేస్తే దీనికి శాశ్వత పరిష్కార మార్గం చేసినట్టవుతుంది.