నిర్లక్ష్యపు నీడలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం..

స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త,

Update: 2025-03-21 08:20 GMT
నిర్లక్ష్యపు నీడలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం..
  • whatsapp icon

దిశ, బంట్వారం : స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాడు. అతను బాబూజీ గా ప్రసిద్ధుడు. భారత పార్లమెంట్ లో నలభై ఏళ్ళ పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర కూడా పోషించాడు. అలాంటి మహనీయుని విగ్రహం ఆవిష్కరణకు నోచుకొని సంఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో నెలకొంది.

వివరాల్లోకి వెళితే గత రెండు సంవత్సరాల క్రితం బంట్వారం యువజన సంఘాలు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణకు పూనుకున్నారు. అదే క్రమంలో రెండేళ్ళ క్రితం ఇప్పుడున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి విగ్రహం బహుమానం ఇవ్వాలని కోరగా వారికి సానుకూలంగా స్పందించి విగ్రహం బహుకరించారు. అయితే బహుకరించిన విగ్రహాన్ని ఆవిష్కరించడం మరిచిపోయి రోడ్డు పక్కన ఒక చెట్టు కింద దిష్టి బొమ్మలా వదిలేశారు. రోజు రోజు కీ దుమ్ము ధూళితో విగ్రహం శిథిలావస్థకు చేరుతుంది. చెట్టు కింద విగ్రహం పడిపోకుండా ఒక తాడు సహాయంతో విగ్రహం మెడకు కట్టి సపోర్టుగా ఉంచారు. అట్టడుగు వర్గాల కొరకు సుదీర్ఘ పోరాటం చేసిన గొప్ప మహనీయునికి ఇంత అవమానం జరగడం భాదకరమనీ స్థానికులు చెబుతున్నారు. తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి విగ్రహావిష్కరణ జరిపించాలని స్థానికులు కోరుకుంటున్నారు.


Similar News