వేధింపులు భరించలేకే హత్య చేశాం.. పోలీసుల ముందు నేరం ఒప్పుకున్న హంతకులు
మద్యం తాగి నిత్యం టార్చర్ చేస్తున్నాడని తల్లి, కోడలు కలిసి కట్టుకున్న భర్త కన్న కొడుకును హత్య చేసామని హంతకులు పోలీసుల ముందు ఒప్పుకున్న సంఘటన పెద్దేముల్ మండలంలోని హమ్మపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, పెద్దేముల్: మద్యం తాగి నిత్యం టార్చర్ చేస్తున్నాడని తల్లి, కోడలు కలిసి కట్టుకున్న భర్త కన్న కొడుకును హత్య చేసామని హంతకులు పోలీసుల ముందు ఒప్పుకున్న సంఘటన పెద్దేముల్ మండలంలోని హమ్మపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలంలోని హన్మపూర్ గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్ అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున రక్తపు గాయాలతో మృతి చెంది ఉన్నాడని, హత్య చేసింది తమ (మృతుడి) తల్లి లక్ష్మమ్మ, వదిన (మృతుడి) భార్య సబిత లపై అనుమానం ఉందని మృతుడి తమ్ముడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. దీంతో మృతుడి భార్య, తల్లిని విచారించగా రోజు మద్యం త్రాగి వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా వెంకటేష్ వేధింపులకు గురిచేస్తూ, నిత్యం టార్చర్ పెడుతున్నాడని తెలిపారు. మద్యం తాగి వచ్చి మళ్లీ వేధింపులకు గురి చేస్తుండగా తల్లి లక్ష్మమ్మ, భార్య సబిత వెంకటేష్ ను ఐరన్ రాడ్లు తీసుకొని చెవి వెనుక భాగంలో బలంగా కొట్టారు. అతనికి తీవ్ర రక్త గాయాలై అక్కడికక్కడే మరణించినాడని వెంకటేష్ ను చంపాలనే ఉద్దేశంతోనే అతని పై దాడి చేశామని మృతుడి భార్య, తల్లి పోలీసుల ముందు నేరం ఒప్పుకోవడంతో వారిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ చేయడం జరిగిందని పెద్దేముల్ ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు.