అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరు...?

అధికార పార్టీకి చెందిన నాయకుల వర్గపోరు రోజురోజుకు తారస్థాయికి చేరుతున్న సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని మైల్వార్ గ్రామంలో కట్టలు తెంచుకుంది.

Update: 2025-03-24 15:49 GMT
అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరు...?
  • whatsapp icon

దిశ,బషీరాబాద్ : అధికార పార్టీకి చెందిన నాయకుల వర్గపోరు రోజురోజుకు తారస్థాయికి చేరుతున్న సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని మైల్వార్ గ్రామంలో కట్టలు తెంచుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మైల్వార్ గ్రామ అభివృద్ధి కోసం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాల్సిన నాయకులు ప్రతీకార చర్యలకు దిగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి విషయంలో ఒకరి పనులు ఒకరు ఒర్వలేక వర్గాలను ప్రేరేపిస్తూ అభివృద్ధికి ఓ వర్గం అడ్డుపడుతున్నట్లు గ్రామంలో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులకు అధికార పార్టీకి చెందిన ఓ వర్గం అడ్డుపడటంతో సోమవారం ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.

విషయం తెలుసుకున్న బషీరాబాద్ తహసీల్దార్ వై. వెంకటేష్, ఎస్ ఐ శంకర్, పోలీస్ సిబ్బందితో కలిసి మైల్వార్ గ్రామాన్ని చేరుకొని గొడవను అదుపు చేసినట్లు సమాచారం. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే అభివృద్ధి పనులను అడ్డంగా పెట్టుకుని గొడవలకు దిగడం సమంజసం కాదని పలువురు విద్యావంతులు కోరుతున్నారు. ప్రజలకు జవాబుదారితనంగా నిలవాల్సిన నాయకులే ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని, యువత దీనిని గ్రహించాలని పలువురు విద్యావంతులు కోరుతున్నారు. దీనిపై తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


Similar News