ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తాండూరు
దిశ, తాండూరు : దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. తాండూరు పట్టణంలోని చెరువెంటి ఈశ్వరుని దేవాలయంలో బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రధాన రహదారి నుండి ఈశ్వరుని ఆలయం వరకు నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజకవర్గంలోని ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆలయాల అభివృద్ధి పనుల కొరకు నిధుల మంజూరుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధిపై, ప్రజల సంక్షేమానికి తాను చిత్తశుద్ధితో పని చేస్తానని అన్నారు.