కళాశాల అధ్యాపకుడి నుంచి డబ్బులు వసూల్…ఇద్దరు నిందితుల అరెస్ట్

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో జరిగిన ఓ ఘటనలో కళాశాల అధ్యాపకుడి నుండి రెండున్నర లక్షలు వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చిందని రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు

Update: 2024-11-19 15:07 GMT

దిశ, తాండూరు రూరల్ (తాండూరు ) : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో జరిగిన ఓ ఘటనలో కళాశాల అధ్యాపకుడి నుండి రెండున్నర లక్షలు వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చిందని రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పెద్దేముల్ ఎస్సై గిరి, తాండూర్ రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న (మైనర్) బాలికలను వేధిస్తున్నారని అప్పట్లో బాధితులపై విద్యార్థినీల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ విషయంపై మైనర్ బాలికలపై వేధింపులకు పాల్పడిన అధ్యాపకుడిపై కేసు పెట్టకుండా చూడటంతోపాటు మీడియాలో (పత్రికలలో) కూడా వారి పేర్లు వ్రాయకుండా, ఉండేందుకు బాధితుడి నుంచి రూ. 3 లక్షలు డబ్బు ఇవ్వాలని విద్యార్థి సంఘం నాయకుడు దీపక్ రెడ్డి, పలు ప్రధాన పత్రికలకు చెందిన గౌస్,కాగా ముకుంద్ రెడ్డి లక్ష్మారెడ్డి,గ్రూప్ గా ఏర్పడి రూ. 2 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న విలేకరులతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుడిపైన జిల్లా కల్లెక్టర్, ఆయా సంస్థల యాజమాన్యాలకు రిపోర్ట్ పంపించడం జరుగుతుందని వెల్లడించారు. కేసులో నిందితులుగా గుర్తించిన ఐదుగురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపించినట్లు చెప్పారు. మరో ముగ్గురు పరార్ లో ఉన్నారని వెల్లడించారు.


Similar News