గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
దిశ, శంకర్ పల్లి : ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మోకిలా సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం… శంకర్ పల్లి మండలం మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ కు వెళ్లే దారిలో ఈనెల 11వ తేదీన మోకిల పెట్రోలింగ్ సిబ్బంది రోడ్డు వెంబడి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ( సుమారు 35) అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. చుట్టుపక్కల వారిని అడగగా ఎవరు గుర్తించలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని పోలీస్ సిబ్బంది చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడు ఏ ప్రాంతానికి చెందినవాడో తెలియ రాలేదు. ఎలా చనిపోయాడో కూడా తెలియలేదు. ఒంటిపై ఎలాంటి గాయాలు కూడా లేవు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరబాబు తెలిపారు.