బ్లేడు దాడిలో 8 మంది యువకుల అరెస్ట్..

బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన బ్లేడు

Update: 2024-11-19 14:22 GMT

దిశ, తిరుమలగిరి : బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన బ్లేడు దాడిలో 8 మంది యువకులను మంగళవారం అరెస్టు చేసినట్లు బోయినపల్లి పోలీసులు తెలిపారు.బోయినపల్లి డీఐ సర్దార్ నాయక్,ఎస్ఐ శివశంకర్ లు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన నితిన్,చందన్ కుమార్ బొలెరో వాహనాన్ని కొనుగోలు చేసుకొని బోయినపల్లి జీవీఆర్ గార్డెన్స్ వద్ద ఉన్న హోల్ సేల్ ఆన్ వీల్ సంస్థలో పెట్టి జీవనం సాగిస్తున్నారని,గత ఆదివారం అర్ధరాత్రి సమయంలో అదే సంస్థలో పనిచేస్తున్న బోయినపల్లి ఆనంద్ నగర్ కు చెందిన యువకులు అరవింద్,సాయి,తేజ,ఖాన్,పైజాన్, బన్నీ లతో పాటు మరో యిద్దరు యువకులు ఓ పార్శిల్ అందించే విషయంలో ఫోన్ లో నితిన్,చందన్ కుమార్ లతో గొడవపడి దుర్భాషలాడారని తెలిపారు.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న 8 మంది యువకులు బీహార్ కు చెందిన ఇద్దరు యువకులను పిలిపించారు.వారు అక్కడకి రాగానే మాట,మాట పెరిగి గొడవ పెద్దదై ఒకరిని ఒకరు తోసుకున్నారు.ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కావడంతో కోపంతో రగిలిపోయిన సాయి తన వద్ద వున్న బ్లేడుతో వారిరువురిపై దాడి చేసి పారిపోయారు. దాడిలో గాయపడిన బాధితులు బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్గొన్న వ్యక్తితో పాటు అతనికి సహకరించిన అయిదుగురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు.దాడిలో పాల్గొని పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు


Similar News