నిబంధనలకు నీళ్లు... ఫైరవీలకే ప్రాధాన్యత

అందినకాడికి దోచుకో... తీసుకో... అడిగే నాథుడే లేడనే విధంగా రియల్ వ్యాపారుల ఆగడాలున్నాయి.

Update: 2024-10-16 10:52 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: అందినకాడికి దోచుకో... తీసుకో... అడిగే నాథుడే లేడనే విధంగా రియల్ వ్యాపారుల ఆగడాలున్నాయి. సాగు భూమిలో రోడ్లు వేయడం, ప్లాటింగ్​ చేయడం చట్ట విరుద్దమనే విషయం రెవెన్యూ అధికారులకు తెలుసు... అయినప్పటికి కండ్లు ఉండి చూడలేని విధంగా వ్యవహరిస్తున్నారు. ఏలాంటి భూములోనైనా నిర్మాణాలు జరుగుతున్నప్పుడు పట్టించుకోవాల్సిన పంచాయతీ అధికారులు తమ పరిధిలోనిది కాదనట్లుగా ఉంటున్నారు. ఓ వ్యవసాయ భూమిని లే అవుట్​ భూమిగా మార్చే ముందు సాగు భూమి నుంచి నాలాకు మార్పిడి చేసి రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. కానీ సాగు భూమిని నాలాగా మార్పిడి జరిగిన తర్వాతే ప్లాటింగ్​ చేసుకోవాలి.

ఆ తర్వాత డీటీసీపీ లేవుట్​కు ప్రతిపాదనలు పెట్టుకోవాలి. అప్పుడు నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్​ చేసి క్రయ విక్రయాలు జరుపాలి. ఇవేమి నిబంధనలు లేకుండా అటు రెవెన్యూ, ఇటు పంచాయతీ అధికారులను మ్యానేజ్ చేసి ఇటీవల కాలంలో అనేక సాగు భూముల్లో లేవుట్లు చేసి రియల్​ మాఫీయా సాగుతుంది. అదేవిధంగా మరొకరు సుమారుగా 5 నుంచి 10 ఎకరాల భూమి వరకు లేవుట్​ చేసి అదనంగా మరో 20 ఎకరాల భూమిలో లేవుట్లు చేస్తున్నారు. ఈ విధంగా అక్రమ లేవుట్లు, ఫామ్ ల్యాండ్​ పేరుతో ఇష్టానుసారంగా భూ మాఫీయా సాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ నియోజకవర్గంలో కొందుర్గు మండలం అక్రమాలకు అడ్డగా మారిపోయింది.

కొందుర్గ్ మండలంపై చిన్నచూపు.....

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ అసెంబ్లీ నియోజకవర్గంలో కొందుర్గ్​ మండలం వివాధాలకు అడ్డగా మారిపోనుంది. జిల్లా కేంద్రానికి చిట్ట చివరి మండలం, వెనుకబడిన ప్రాంతంపై అందరికి చిన్న చూపే... ఈ మండల పరిధిలో ఏమీ చేసిన అడిగే నాథుడే లేడనే ధోరణితో ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ మండలంలో ప్రధానంగా మండల పంచాయతీ అధికారి, రెవెన్యూ అధికారులే కీలకం. వీరి ఇద్దరూ సమన్వయంతో పని చేస్తూ అక్రమాలపై నిఘా పెడితే ఎవరి వ్యవహారం ఏమిటీ అనేది బహిర్గతమైతుంది. ఎంపీవో అక్రమ లేఅవుట్లపై నోరు మెదపకుండా కార్యదర్శులను తప్పుడు పద్దతుల్లో పనిచేసేందుకు ప్రోత్సహిస్తున్న ట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు కనీస అవగాహన లేకుండా గుంటలల్లో కూడా భూములును రిజిస్ట్రేసన్​ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సమకూర్చే మార్గాలను అన్వేషించాలని లాబోదిబో మొత్తుకుంటున్న ప్రయోజనం లేకుండా పోయింది.


వాస్తవంగా రెవెన్యూ అధికారులు ఆలోచన ప్రజల పక్షమైన, ప్రభుత్వ పక్షమైన కచ్చితంగా 5 గుంటల భూమికి, అతితక్కువ గుంటలల్లో భూమిని రిజిస్ట్రేసన్​ చేస్తున్నప్పుడు క్షేత్రస్ధాయిలో పరిశీలించే బాధ్యత తహసీల్ధార్కు ఉండాలి. అవసరమైతే అనుమానం ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారిని ఫీల్డ్​ విజిట్​ చేసి విచారణ చేపట్టాలి. అప్పుడు అసలు కథ తెలుస్తోంది. కానీ ఇవేమీ తమ పరిధిలోనికి రావు, తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చులకనగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే రాబడిని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. కొందుర్గ్​ మండలంలో వందల ఎకరాల భూమిని రియల్​ వ్యాపారులకు ఏలాంటి అనుమతులు, ఎన్వోసీలు లేకుండా అప్పనంగా దందా సాగిస్తున్నారు.


రవీశ్​ రియాలటీ ఇన్​ఫ్రా డెవలపర్స్​ ఎల్​ ఎల్పీ కంపెనీ కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 37,38,39లలో సుమారు 26 ఎకరాలల్లో నిబంధనలకు విరుద్దంగా లేవుట్లు చేశారు. ఈ సాగు భూమిని నాలాగా మార్చుకుండా ఏవిధంగా లేవుట్లు చేస్తారని సంబంధిత అధికారిని అడిగితే సమాధానం ఉండదు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న లేవుల్లో రోడ్లు, కడీలు నాటడం ఏలా జరుగుతుందని పంచాయతీ కార్యదర్శిని అడిగితే సమాధానం ఉండదు. సమాధానం ఇవ్వకపోయిన కనీసం ఆ రియల్​ వ్యాపారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతున్నారు. ఈ అధికారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అత్యంత క్రియాశీల మంత్రి సోధరుడిగా చెప్పుకుంటూ వ్యాపారులు కాలం గడుపుతున్నారు. అంటే మంత్రి, ఎమ్మెల్యే బంధువులు, కుటుంబ సభ్యులకు నియమ నిబంధనలుండవ్​...


కొందుర్గు మండలం కేంద్రంలో ఇన్క్రెడిబుల్ ఇండియా పేరుతో సుమారు 400 ఎకరాలకు పైగా వ్యవసాయ పొలంలో వెంచర్​ ఏర్పాటు చేస్తున్నారు. 20, 22, 25, 26, 28, 249, 254, 265, 270,274,276,277,278,282,283,285,290,292,293,295,300,302,372,378,44,46,53,56,59,64,68,69 సర్వే నెంబర్లలో డిటిసిపి అనుమతితో లేవుట్​ చేసినట్లు చూపిస్తున్నారు. అయితే కేవలం 38 ఎకరాలకు అనుమతి తీసుకోని మరో 421 ఎకరాలకు అనుమతి ఉన్నట్లు రియల్​ వ్యాపారులు ప్రచారం చేస్తున్నారు. మొత్తం 600 ఎకరాల్లో లేవుట్​ చేసి ప్రజలను మోసం చేసే పనిలో రియల్​ వ్యాపారులున్నారు. ఈ లేవుట్​పై కూడా పంచాయతీ అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తున్నారు. నిబంధనలున్నాయా లేవా అనే ఆలోచన మరిచిపోయినట్లు తెలుస్తోంది.

కొందుర్గు మండలం చెరుకుపల్లిలో సర్వే నెంబర్లు 238,239,242, 246, 249, 250,263 లల్లో స్వర్గసీమసుకెతన 372 ప్లాట్లు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో వందల ఏకరాల్లో లేవుట్లు చేశారు. కానీ కేవలం పదుల సంఖ్యలోని ఎకరాల్లోనే అనుమతి తీసుకున్నారు. అంతేకాకుండా ఇదే లేవుట్లోల 8ఫీట్ల వెడల్పుతో ప్రవహించే నాలాను పూర్తిగా కబ్జా చేశారు. అయినప్పటికి రెవెన్యూ, ఇరిగేషన్​, పంచాయతీ అధికారులు కండ్లు మూసుకొని ఉండడం విడ్డూరం.


Similar News