నాలుగు గంటలపాటు సాగిన విజయ్ మద్దూరి విచారణ
డ్రగ్స్ పార్టీ కేసులో ఏ 2 నిందితుడిగా ఉన్న విజయ్ మద్దూరి
దిశ, చేవెళ్ల : డ్రగ్స్ పార్టీ కేసులో ఏ 2 నిందితుడిగా ఉన్న విజయ్ మద్దూరి బుధవారం మోకిలా పోలీస్ స్టేషన్ కు విచారణ హాజరయ్యారు. దాదాపు 4 గంటలపాటు విచారించిన పోలీసులు విచారణలో డ్రగ్స్ పార్టీలోకి ఎలా వచ్చాయ్, వాటిని ఎలా సరఫరా చేశారు. ఎవరెవరు స్వీకరించారు అనే కోణంలో విచారణ జరిగినట్లు తెలుస్తుంది. ఇంకా విచారణ కొనసాగుతుంది అని పోలీసులు తెలిపారు. ఏ2 నిందితులుగా ఉన్న విజయ్ మద్దూరికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.