అకాల వర్షం.. రైతులకు అపార నష్టం..
పరిగిలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, ఓ మోస్తారు వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి.
దిశ, పరిగి: పరిగిలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, ఓ మోస్తారు వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. పరిగి మండల పరిధిలోని మాదారం, పొల్కంపల్లి, ఖుదావంద్ పూర్, నర్సయ్యగూడతో పాటు వివిధ గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నర్సయ్యగూడ లో జొన్న పంట నేలకొరిగింది. మాదారం పొల్కంపల్లి గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఖుదావంద్ పూర్ గ్రామంలో సుబ్బారెడ్డి మామిడి తోటలో కాయలు నేలరాలాయి. చిగురాల్ పల్లి గ్రామంలో కోత కొచ్చిన వరి పొలం నేలకొరిగింది.
ఈ పంటలను సోమవారం వ్యవసాయాధికారులు పరిశీలించారు. నేల కొరిగిన మొక్కజొన్న, జొన్న పంటలను నాలుగైదు మొక్కలను కలిపి కట్టేసీ కాపాడుకునే ప్రయత్నం చేయాలని రైతులకు సూచించామని ఏఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నేలకొరిగిన పంటలను బీజేపీ నాయకులు పరిశీలించారు. నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్, జిల్లా కార్యదర్శులు పెంటయ్య, హరికృష్ణ, సీనియర్ నాయకులు రాము యాదవ్, పట్టణ అధ్యక్షుడు శ్రీశైలం, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహా, నాయకులు రమేష్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.