మంచు కుటుంబలో ఆగని మంటలు
నా తల్లి బర్త్ డే ను అడ్డం పెట్టుకొని ఇంట్లో భారీ కుట్రకు తెరలేపారని మంచు మనోజ్ ఆరోపించారు.
దిశ, బడంగ్ పేట్ : నా తల్లి బర్త్ డే ను అడ్డం పెట్టుకొని ఇంట్లో భారీ కుట్రకు తెరలేపారని మంచు మనోజ్ ఆరోపించారు. ఈ మేరకు మంచు మనోజ్ విడుదల చేసిన ప్రకటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయని ఆయన వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది. ఈ నెల 14వ తేదీన జల్ పల్లి మంచు టౌన్ లోని తన ఇంట్లో జరిగిన అతి భయానక ఘటన గురించి తెలుసుకొని తీవ్రంగా కలవర పడ్డానని, సంఘటన తీవ్రంగా కలిచి వేసిందన్నారు. నిజం నిప్పులాంటిదని, దానిని బయట పెట్టడం నా బాధ్యతగా భావిస్తున్నానన్నారు. 14 వ తేదీన శనివారం తాను షూటింగ్ లో ఉన్నానని, తన భార్య, కుమారుడు పాఠశాల ఈవెంట్ కు హాజవ్వడానికి వెళ్తుండగా మా అమ్మ జన్మదినం సందర్భంగా కేక్ నెపంతో మా సోదరుడు మంచు విష్ణు తో పాటు అతని సహచరులు రాజ్, కిరణ్, విజయ్ రెడ్డి లు బౌన్సర్ల తో కలిసి తన ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం వారు తన ఇంట్లో ని జనరేటర్ ను తారు మారు చేశారు. ఆ జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్ ను కలిపి భారీ కుట్రకు తెర లేపారని ఆరోపించారు.
అర్ధరాత్రి జనరేటర్ పనిచేయక పోవడం తో పాటు విద్యుత్ హై, లో వోల్టేజ్ సమస్యలు తలెత్తాయన్నారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న నా వృద్ధ తల్లి, 9 నెలల కుమార్తె, మా మామ, మా అత్త తో పాటు కుటుంబం మొత్తం పెద్ద ప్రమాదంలో పడిందన్నారు. జనరేటర్ దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు పార్క్ చేసి ఉండడంతో పాటు ఇంట్లో గ్యాస్ కనెక్షన్ లు యాక్టివ్ గా ఉన్నాయని, ఒకవేళ పేలుడు జరిగినట్లయితే పెద్ద ఎత్తున వినాశనం జరిగేదని, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేదన్నారు. నా భద్రత సిబ్బందిని కూడా విష్ణు అతని సోదరులు బలవంతంగా వెళ్ళగొట్టారని, నా దంగల్ కోచ్ ను కూడా బెదిరించారని ఆరోపించారు. వాళ్ళు జోక్యం చేసుకుంటే అతని తో పాటు అతని కుటుంబానికి హాని చేస్తామని హెచ్చరించారు. భద్రత పట్ల మనోజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మా అమ్మ పుట్టినరోజు, వేడుకల కోసం ఉద్దేశించిన రోజున ఇలా జరగడం మా హృదయాన్ని కలచివేసిందని, నా కుటుంబం నేను ఇప్పుడు మా జీవితాల గురించి నిరంతరం భయంతో జీవిస్తుగడపాల్సి వస్తుందన్నారు. వెంటనే పోలీసులు స్పందించి ఘటనకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.