గ్రూప్ 2 సెంటర్లోకి సెల్ ఫోన్..!

ఎంతో పగడ్బందీగా నిర్వహించాల్సిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక అభ్యర్థి ఏకంగా ఎగ్జామ్స్ సెంటర్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లాడు

Update: 2024-12-15 16:08 GMT

దిశ ప్రతినిధి వికారాబాద్ : ఎంతో పగడ్బందీగా నిర్వహించాల్సిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక అభ్యర్థి ఏకంగా ఎగ్జామ్స్ సెంటర్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాయి డెంటల్ కాలేజ్ సెంటర్లో ఆదివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 15వ తారీకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు గ్రూప్ 2 మొదటి పేపర్ పరీక్ష నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పేపర్ నిర్వహిస్తున్న సమయంలో సదరు అభ్యర్థి హడావిడి చేసినట్లు ఇన్విజిలేటర్ గుర్తించినట్లు తెలుస్తుంది.

అప్పుడే సదరు వ్యక్తి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ దొరికిందని సమాచారం. దాంతో అతనిని బయటికి పంపి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్ష హాల్ లోకి వెళ్లే సమయంలో సరైన చెకింగ్ లేకపోవడం కారణంగానే సెల్ ఫోన్ తో వ్యక్తి లోపలికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో అధికారులు ఎవరూ ఉన్నారు. ఎవరి నిర్లక్ష్యంతో ఈ సంఘటన జరిగింది అనే విషయమై అధికారులు విచారిస్తున్నారు. అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సంఘటన పట్ల ఎలాంటి సమాచారం బయటకు రాకుండా అధికారులు గోప్యత వహిస్తున్నారు. సమయం రాత్రి 9 అవుతున్న ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.


Similar News