నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి : మంత్రి సీతక్క
రైతులు పండించిన వరి ధాన్యం నుంచి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
దిశ, పరిగి : రైతులు పండించిన వరి ధాన్యం నుంచి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పరిగిలోని డీసీఎంఎస్ రైస్ మిల్లును ఆదివారం ప్రారంభించారు. డీసీఎంఎస్ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని డీసీఎంఎస్ నిర్వాహకులు కుర్వ నరేష్, మార్కెటింగ్ శాఖ, డీసీఎం ఎస్ అధికారులకు సూచించారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ బూన్నగారి పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ సయ్యద్ అయూబ్ తో, నాయకులు కె.హన్మంతు ముదిరాజ్, కావలి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మూల సత్యనారాయణ రెడ్డి, ఎజాస్, జగన్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు.