అనుమతి లేని సిమెంట్ మిక్సర్ ప్లాంట్.. అధికారుల నోటీసులు బేఖాతరు..

అనుమతి లేని సిమెంట్ మిక్సర్ ప్లాంట్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు జరుగుతున్నాయని, పనులు ఆపాలని పంచాయతీ కార్యదర్శి నోటిస్ జారిచేసిన సిమెంట్ మిక్సర్ ప్లాంట్ యాజమాన్యం మాత్రం నోటిస్ ను పట్టించుకోకుండా కార్యకలాపాలు జరుపుతున్నారు.

Update: 2024-12-26 06:35 GMT

దిశ, చేవెళ్ల : అనుమతి లేని సిమెంట్ మిక్సర్ ప్లాంట్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు జరుగుతున్నాయని, పనులు ఆపాలని పంచాయతీ కార్యదర్శి నోటిస్ జారిచేసిన సిమెంట్ మిక్సర్ ప్లాంట్ యాజమాన్యం మాత్రం నోటిస్ ను పట్టించుకోకుండా కార్యకలాపాలు జరుపుతున్నారు. చేవెళ్ల మండలంలోని దామరగిద్ద రెవెన్యూ పరిధిలో ఉన్న సిమెంట్ మిక్సర్ ప్లాంట్ ను అనుమతులు లేకుండా ఏర్పాటు చేసి సిమెంట్ మిక్సర్ ను ఆర్గానో వెంచర్ వాడుకునట్లు దిశ వెబ్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించి పంచాయతీ అధికారులు సిమెంట్ ప్లాంట్ మిక్సర్ యాజమాన్యంకు పనులు జరుపకూడదు అని నోటిస్ జరిచేశారు. నోటిస్ జారీచేయడంతో కొన్ని రోజులు పనులు ఆపిన యాజమాన్యం ఇప్పుడు మళ్ళీ కార్యకలాపాలను జరుపుతున్నారు.

అధికారుల చర్యలు కేవలం నోటీసులకే పరిమితమా లేక అధికారుల నోటీసులను సిమెంట్ మిక్సర్ ప్లాంట్ యాజమాన్యం లెక్క చేయడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాను.. పంచాయతీ కార్యదర్శి సజన

నోటిస్ ఇచ్చిన తర్వాత పనులు ఆపేశారు. మళ్ళీ మొదలు పెట్టినట్టు ఉన్నారు. నేను విజిట్ చేసి కచ్చితంగా సిమెంట్ మిక్సర్ ప్లాంట్ పై చర్యలు తీసుకుంటాను.


Similar News